జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శలు

 

 

 

 

 

జనంసాక్షి , మంథని :వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ లో అనారోగ్యంతో బాధపడుతు చికిత్స పొందుతున్న తన వ్యక్తిగత డ్రైవర్ నీలం దేవేందర్ తండ్రి నీలం సమ్మయ్య ను సోమవారం మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అలాగే వరంగల్ హన్మకొండ లోని సంరక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మంథని మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల ఆకాష్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.