జనవరి 2 నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ
ఢిల్లీ : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో హోంమంత్రి షిండే, సీఎం షీలాదీక్షిత్ భేటీ అయ్యారు. అత్యాచార ఘటనలపై విచారణకు 5 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు జనవరి 2 నుంచి ఇలాంటి ఘటనలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
ప్రకాశం : మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలమీద అత్యాచారాలను ఖండిస్తూ ప్రకాశంలో జరిగిన భారీ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు.