జనాలు లేని ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: ఇందిరమ్మ బాట జనాలు లేని బాటగానే ఉందని తెదేపా నేత ఎర్రన్నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టభవన్‌లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారంతా కాంగ్రెస్‌ కార్యకర్తలేనని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలు పరిష్కరించెందుకు ప్రభుత్వం మార్గాలు అన్వేషించాలని అన్నారు. చేతనైతే ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగుచేయటానికి ప్రయత్నించాలని ఆయన అన్నారు. ఐఏఎన్‌లపై టీజీ వెంకటేశ్‌ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయన్నారు. అధికారి ఎవరైనా తప్పు చేస్తే ఫిర్యాదు చేయాలితప్ప కాల్చి చంపమనే హక్కు ఎవరికీ లేదన్నారు.