జపాన్‌లో భూకంపం :రిక్టర్ సూచిపై 7.4
టోక్యో: జపాన్ తూర్పు భాగంలో శుక్రవారం పెనుభూకంపం సంభంవించింది. ఇది రిక్టర్ సూచిపై 7.4గా నమోదు అయింది. టోక్యోకు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అయితే ఇది విస్తృతమైనది కాదని టోక్యోలోని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ప్రజలు భయపడరాదని కోరింది. శుక్రవారం వేకువజామున 5.15 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి.తూర్పుతీరంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పోవాలని కోరారు. కాగా పుకుషిమా అణుకేంద్రం భద్రంగానే ఉందని టోక్యోఎలక్ట్రిక్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిసింది. టోక్యోలో ఎత్తైన భవనాలు కంపించాయి. తమ ఆర్ధిక వ్యవస్థలకు ప్రమాదం లేదని కంప్యూటర్ వ్యవస్థలు నెట్‌వర్కింగ్ వ్యవస్థలు సరిగానే పనిచేస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ జపాన్ ఒక ప్రకటనలో తెలిపింది.