జమ్మూలో ఎన్‌కౌంటర్‌ విదేశీ ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లోని గండేర్భర్‌ జిల్లాలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో విదేశీ ఉగ్రవాది ఒకడు హతమయ్యాడు. చాతుర్గుల్‌ గ్రామం సమీపంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న ప్రత్యేక భద్రతా దళం సిబ్బంది జమ్మూకాశ్మీర్‌ పోలీసులు శనివారం తెల్లవారుజామున సంయుక్తంగా గాలింపు చేపట్టినట్లు రక్షణశాఖ ప్రతినిధి లెప్టినెంట్‌ కల్నల్‌ జె.ఎన్‌.బ్రార్‌ తెలిపారు. తారసపడిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురు కాల్పులు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సంఘటనలో ఒక ఉగ్రవాది మృతి చెందాడని, మరో ముగ్గురు అదే ప్రాంతంలో ఉన్నారని వివరించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.