జర్మనీ మహిళపైఆత్యాచారం, దోపిడీ

ముంబయి : నవంబర్‌ 5, (జనంసాక్షి)
నగర శివారులోని బాంద్రాలోని ఒక ప్లాట్‌లో సోమవారం వేకువజామున ఒక జర్మన్‌ వనితపై అత్యాచారం చేయటమే కాక దోపిడీ చేసిన సంఘటన తెలియవచ్చింది. బాధితురాలు  (27) సంగీత కళాకారిణి. సెర్రీక్రాస్‌ రోడ్‌లో ఒక భవనంలోని 3వ అంతస్తులో ఆమె అద్దెకు ఉంటోంది. దొంగ కిటికీ ద్వారా చొరబడి కత్తితో ఆమెను బెదిరించి విలువైన ఆభరణాలు దోచుకున్నాడు. కొన్ని డాలర్లు, భారత కరెన్సీ, ఒక కెమెరాను లాక్కున్నాడు. తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమేరకు ఆమె బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేకువజామున సుమారు 3.30-4.00 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆమె అప్పుడు గాఢనిద్రలో ఉంది. నేరం చేసిన తరువాత అతడు పరారయ్యాడు. నిందితుని కోసం పోలీసులు తీవ్రంగా  గాలిస్తున్నారు.