జలయజ్ఞంలో 20లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చాం : సీఎం

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం ప్రజెక్టుల కోసం రూ.65వేల కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అలాగే జలయజ్ఞంలో 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇచ్చామన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నెట్టెంపాడులో జిరిగిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.