జవహర్ లాల్ నెహ్రూ 123వ జయంతి
ఢిల్లీ: నవంబర్ 14, (జనంసాక్షి):
జవహర్లాల్ నెహ్రూ 123వ జయంతి వేడుకలు దేశంలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ,ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీలతో పాటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లు యమునా నదీ తీరంలో ఉన్న శాంతి వనంలోని నెహ్రూ ఘాట్‌కు నివాళులు అర్పించారు.వీరితో పాటు యూపీఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కేంద్రమంత్రులు సల్మాన్ ఖుర్షీద్,కమల్ నాథ్, డిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తదితరులు నెహ్రూ జయంతిని పురస్కరించుకొని పుష్పగుచ్చాలు సమర్పించారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత మూడు రంగులతో నిండి ఉన్న బెలూన్లను ఆకాశంలో ఎగురవేశారు.దేశ ప్రప్రథమ ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ నవంబర్14,1889న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌లో మోతీలాల్ నెహ్రూ,స్వరూప్ రాణిలకు జన్మించారు.ఆయన పుట్టినరోజు సందర్బంగా బాలల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.