జాతీయ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైన వసీం
నాయుడుపేట : నెల్లూరు జిల్లా నాయుడు పేట విశ్వం జూనియర్ కళాశాలలో ఇంటర్ సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షేక్ వసీం అక్రమ్ అనే విద్యార్థి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 16.17 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అంతర్జిల్లా కళాశాలల షటిల్ పోటీల్లో రాష్ట్రం నుంచి ఐదుగురిని ఎంపిక చేయగా అందులో వసీం ఒకడు, దీంతో బ్యాడ్మింటన్ పోటీల నిర్వాకులు అతనికి బంగారు పతకం బహుకరించారు.