జానారెడ్డి తెలంగాణ ద్రోహి: రాజగోపాల్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య పొరపొచ్చాలు బయట పడుతున్నాయి. తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా మంత్రి పదవి పట్టుకుని వేళ్లాడుతున్న మంత్రి జానారెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జానారెడ్డి తెలంగాణ ద్రోహి అని ఆయన విమర్శించినట్లు సమాచారం. ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావు నివాసంలో జరుగుతోన్న తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశానికి మంత్రి జానారెడ్డిని కేకే ఆహ్వానిస్తూ ఫోన్ చేశారు. అయితే మంత్రి జానారెడ్డి సమావేశానికి వస్తే తాను బహిష్కరిస్తానని, జానా తెలంగాణ ద్రోహి అని రాజగోపాల్ అన్నట్టు సమాచారం తెలిసింది.