జానా ‘కు’ ఝలక్‌

హైదరాబాద్‌: రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి జానారెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. ఆదివారం నగరంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌కు సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వాదులు ఈ ప్రాంత మంత్రుల వైఖరిని తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాయర్‌, తదితరులు అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్‌, తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులు కూడా లేవడంతో గందరగోళం నెలకొంది. కొందరు తెలంగాణ వాదులు జానాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి పదవి తీసుకోవద్డని డిమాండ్‌ చేశారు. మంత్రులకు ఆహ్వానం లేకపోయినా కార్యక్రమానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఈ సమయంలో ఎంపీ వివేకానంద ఆహ్వానిస్తే వచ్చానని జానా తిలిపారు. సకల జనుల సమ్మె సందర్భంగా అరెస్టయిన స్వామిగౌడ్‌ను వెంటనే విడుదల చేయించిది తానే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కావాలంటే కేసీఆర్‌ను అడగవచ్చన్నారు.