జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలిజాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
సూర్యాపేట ప్రతినిధి,మార్చి 25(జనంసాక్షి): ఈ నెల 28న జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ వి.వెంకటేశులు శనివారం ఒక ప్రకటనలో కోరారు.ఈ జాబ్ మేళాలో మొత్తం 450 ఉద్యోగ నియామకాల కొరకు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నట్లు తెలిపారు.2021, 2022లో డిగ్రీ పాసైన వారితో పాటు ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని చెప్పారు.ఆసక్తిగల అభ్యర్థులు వారి యొక్క బయోడేటా, డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వెంకటేశులు 9440194909 , టాస్క్ కోఆర్డినేటర్ అశోక్ కుమార్ – 9966627969 సెల్ నెంబర్ లలో సంప్రదించవచ్చని తెలిపారు.