జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఛాత్రా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఓసీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ ఉన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం