జార్ఖండ్‌లో కొత్త సర్కార్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం : శిబూసోరెస్‌

రాంచీ : జార్ఖండ్‌ ముఖ్యమంత్రి అర్జున్‌ముండా రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు జేఎంఎం అధినేత శిబూసోరెన్‌ ప్రకటించారు. 81 స్థానాలు ఉన్న రాష్ట్ర అసెంబ్లీలో భాజపా, జేఎంఎంలకు చెరో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 13 మంది సభ్యుల బలం ఉంది. భాజపా సంకీర్ణ ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరించు కోవడంతో ఈ ఉదయం ముఖ్యమంత్రి పదవికి అర్జున్‌ముండా రాజీనామా సమర్పించారు.