జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ ఆరుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి

రాంచీ : జార్ఖండ్‌లోని లాతేర్‌ అటవీప్రాంతంలో సోమవారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్పీఎఫ్‌ బలగాలు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో ఆరుగురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతిచెందినట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో జవాన్లు గాయపడినట్లుగా తెలిసింది. మావోయిస్టులకు ఎంతమేరకు నష్టం వాటిల్లిందని అనే వివరాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశమున్నట్లు సమాచారం.