జాలర్లను విడుదల చేసిన పాకిస్తాన్
ఇస్లామాబాద్, ఆగస్టు 2 (జనంసాక్షి) :
పాకిస్థాన్ 163 మంది భారత జాలర్లను విడిచిపెట్టింది. వీరిలో 11 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. ఈ మత్స్యకారులను వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగిస్తారు. పాక్ జైళ్లలో మొత్తం 355 మంది భారత జాలర్లున్నారు. భారత జైళ్లలో 27 మంది పాక్ జాలర్లున్నారు. మత్స్యకారులను విడుదల చేయడంపై కేంద్ర ప్రభుత్వం పాక్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. భారత్ పాక్ ప్రధానులు రష్యాలోని ఉఫాలో కలుసుకున్న సందర్భంగా వీరి విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. జాలర్ల విడుదల సందర్భంగా పాకిస్థాన్‌లోని స్వచ్ఛంద సంస్థలు వారికి బహుమతులు, నగదు ఇచ్చారు.