జిరాక్స్ సెంటర్లు తెరిస్తే కఠిన చర్యలు తప్పవు.
ఎస్సై కోనారెడ్డి
జుక్కల్, ఎప్రిల్ 01, (జనం సాక్షి),
పరీక్షల సమయంలో జీరాక్స్ సెంటర్లు తెరచిఉంచితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ ఎస్సై కోనా రెడ్డి అన్నారు.ఆయన శనివారం మండల కేంద్రంలోని జీరక్స్ సెంటర్ ల యజమానులతో సమావేశం ఏర్పాటుచేశారు. సోమవారం నుండి పదవతరగతి పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.పరీక్షల సమయంలో ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జీరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని తెలిపారు.ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది , జీరాక్స్ సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు.