జిల్లాల్లోని పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి):
ఖమ్మం జిల్లాలో కొత్తగా 25 ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెడుతున్నట్లు ఆర్‌విఎం ఎపిఓ రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన కంప్యూటర్‌ విద్యను అందించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని 271 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య నిర్వహిస్తున్నారన్నారు. గత సంవత్సరం జరిగిన లోపాలను సరిచేస్తున్నామని తెలిపారు. 33 కస్తూర్భా విద్యాలయాలు, 103 ప్రాథమికోన్నత పాఠశాలల్లో కంప్యూటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.