జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన నాగరాజు
అయిజ, సెప్టెంబర్ 3 (జనం సాక్షి):
ఐజ న్యూస్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణమ్మ సూచన మేరకు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి నాగరాజు లక్ష్మీ మొబైల్స్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగింది. తదనంతరం జిల్లా కార్యవర్గ సభ్యులుగా నాగరాజుకు ఎన్నికైనందుకుగాను జిల్లా అధ్యక్షులు శుభాకాంక్షలు తెలుపుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్,అలంపూర్ ఐటీ కో కన్వీనర్ నవీన్ కుమార్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు అంజి స్నేహ టిఫిన్ సెంటర్ ప్రధాన కార్యదర్శి పరశురాం,పట్టణ కోశాధికారి,శేషు,కామర్తి శివ తదితరులు పాల్గొన్నారు.