జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు….

 

 

 

 

 

 

 

 

కూకట్ పల్లి జనంసాక్షి : జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను గురువారం కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని ఘనంగా జరుపుకున్నారు.నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి గౌరీ మాతకు నైవేద్యంగా నివేదించారు. అనంతరం బతుకమ్మలను పేర్చి చిత్తు చిత్తుల గుమ్మ శివుడి ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడలోన అంటూ అడుతు…పాడుతూ మహిళలు వైభవంగా బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం సమీప కొలనులో నిమజ్జనం చేశారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి, బాలాజీ నగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీష హాజరై ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.