జీడిమెట్ల అగ్నిప్రమాదంలో అదుపులోకి వచ్చిన మంటలు

హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో నిన్న చోటచేసుకున్న అగ్నిప్రమాద ఘటనలో మంటలు గురువారం ఉదయం అదుపులోకి వచ్చాయి. 10 అగ్నిమాపకశకటాలతో సిబ్బంది. తీవ్రంగా శ్రమించి సుమారు 22 గంటల అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. జీడిమెట్లలోని భారత్‌ ఫెక్సో పరిశ్రమలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రసాయన డ్రమ్ములు పేలి మంటలు భారీగా వ్యాపించిన విషయం తెలిసిందే.