జీహెచ్‌ఎంసీ పరిధిలో జోన్ల పెంపు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– జోన్ల పెంపుతో మరో 1,610 ఉద్యోగాలకు మంజూరు
హైదరాబాద్, ఆగస్టు4(జనం సాక్షి) : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. జీహెచ్‌ఎంసీలో 1,610 పోస్టులను మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 30 సర్కిళ్లను 48 సర్కిళ్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరు జోన్ల నుంచి 12 జోన్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ప్రతి రెండు అసెంబ్లీ స్థానాలకు ఒక జోన్ ఉండే విధంగా నిర్ణయించారు. ప్రతి జోన్ పరిధిలో నాలుగు సర్కిళ్లు ఉండే విధంగా ఏర్పాటు చేశారు. సర్కిళ్లు, జోన్ల పెంపుతో 1,610 అదనపు పోస్టులకు అవకాశం కలిగిందని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో మరింత వేగవంతం, సమర్థవంతంగా, పారదర్శకంగా పౌరసేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి ఉక్ష నెం.149ను ప్రభుత్వం పురపాలక పరిపాలన నగరాభివృద్ధి శాఖ విడుదల చేసింది.



