జుందాల్‌కు 15రోజుల పోలీసు కస్టడీ

న్యూఢిల్లీ:ముంబయి దాడులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న జూబుద్దీన్‌ అన్సారీ ఆలియాస్‌ అబు జుందాల్‌ లీసు కస్టడీని మరో 15 రోజులు పొడిగిస్తూ ఇస్తూ తీస్‌హజారీ న్యాయస్ధానం ఆదేశాలు జారీచేసింది.జుందాల్‌ కస్టడీ ముగియడంతో ఆయనను న్యాయస్ధానంలో హజరుపరిచారు.ముంబయి దాడులకు సంబందించి కరాచీలోని కంట్రోల్‌రూంలో జకీవుర్‌రహ్మన్‌,ఐఎస్‌ఐ అధికారులతో పాటు అన్సారీవున్నాడని పొలీసులు తెలిపారు.జుందాల్‌ను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని ముంబయి పోలీసులు,జాతీయ దర్యాప్తు సంస్థలు న్యాయస్థానాన్ని అభ్యర్థించాయి.అయితే దీనిపై న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.