జూనియర్‌ ట్రైనీ అభ్యర్థులకు మరో అవకాశం

ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారంలో రేపు నిర్వహించనున్న జూనియర్‌ ట్రైనీ రాత పరీక్షకు హాల్‌ టిక్కెట్లు అందని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు కర్మాగార అధికారులు తమ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. 22వ తేదీన జరిగే పరీక్షలో అర్హుల జాబితాను జులై 10న ప్రకటించామన్నారు. దీనిలో చాలా మంది అర్హుల పేర్లు వెబ్‌సైట్లో పెట్టలేదని వినతులు వచ్చిన దృష్ట్యా వారికి ఆగష్టు 26 వ తేదీన పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. వీరు ఆగస్టు 2వ తేదీలోపు ఆన్‌లైన్లో పంపిన దరఖాస్తు ప్రతి, ఫోటో, సంతకం, పీజు చెల్లించిన రశీదుతో కూడిన దరఖాస్తులను పోస్టుబాక్స్‌ నెంబర్‌ 395, ఆంధ్రయునివర్శిటీ పోస్టాఫిస్‌, విశాఖపట్నం 53000కు పంపించాలని సూచించారు. అర్భుల జాబితాను 10వ తేదీన వెబ్‌సైట్‌లో పెడతామని అప్పటీకీ ఏమైన తేడాలు ఉన్నట్లు గుర్తిస్తే 14వ తేదీన నేరుగా నియామక విభాగంలో సమర్పించాలని పేర్కొన్నారు.