జూనియర్‌ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రత్నకిశోర్‌ అన్నారు. నెలరోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూనియర్‌ డాక్టర్ల్‌ తక్షణం సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని మార్గాలు విఫలమైతే ఎస్మా ప్రయోగం తప్పదని హెచ్చరించారు. వైద్యవిద్యార్థులు ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.