జూరాల జలాశయంలో మూడు విద్యుదుత్పత్తి ప్రారంభం

మహబూబ్‌నగర్‌: జూరాల జలాశయంలోని మూడు యూనిట్లలో ఈరోజు విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. జూరాల జలాశయం నుంచి శ్రీశైలానికి 26వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 316 మీటర్లకు చేరింది. ఇన్‌ఫ్లో 70వేల క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.