జె ఎస్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ర్యాలీ.

జహీరాబాద్  ఆగస్టు 17 (జనంసాక్షి)  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా  జహీరాబాద్ లోని జె ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు  సిబ్బంది కలిసి పట్టణంలో తిరంగా ర్యాలీని  నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రగతి నర్సింగ్ హోమ్ కి ఎదురుగా ఉన్న జె.ఎస్ కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా ర్యాలీ సాగడంతో రోడ్డు ఇరువైపులా ఉన్న ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులలో దేశభక్తి ని నింపడానికి జాతి సమైక్యతను చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని   కళాశాల ప్రిన్సిపల్ హేమానంద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులతో పాటు  సిబ్బంది పాల్గొన్నారు.