పెద్ద దిక్కును కోల్పోయిన చిన్నారులకు రూ.2 లక్షల 75 వేల 600 అందజేత

 

 

 

 

 

 

చెన్నారావుపేట, జనవరి 5 (జనం సాక్షి):

మొత్తం రూ. 4 లక్షల 24 వేల 500 అందిన ఆర్థిక సహాయం…

గ్రామస్తులు, దాతలు, దయార్థ హృదయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు…

“జనం సాక్షి”కి ధన్యవాదాలు…

 

పెద్ద దిక్కును కోల్పోయిన చిన్నారులకు గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ 3వ వార్డు వాసులు, దాతలు, దయార్థ హృదయులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అందించిన మొత్తం 2 లక్షల 75 వేల 620 రూపాయలను ఆర్థిక సహాయంగా సోమవారం అందజేశారు. మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన పల్లాటి సబిత విద్యుత్ షాక్ తో ఇటీవల మృతి చెందింది. ఆమె మృతితో ఇద్దరు చిన్నారులు దేవిక, సహస్రలు పెద్ద దిక్కును కోల్పోయారు. డిసెంబర్ 27న “జనం సాక్షి” దిన పత్రికలో విద్యుత్ ఘాతంతో తల్లి మృతి.. పెద్ద దిక్కును కోల్పోయిన చిన్నారులు…అని కథనం రాయడం జరిగింది.ఈ కథనాన్ని గ్రామ మాజీ సర్పంచ్ తప్పెట రమేష్ వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో తల్లిని కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పోస్టులు పెట్టి వేడుకున్నారు. దీంతో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చి రూ.65 వేల 800, గ్రామ 3వ వార్డు వాసులు రూ.72 వేల 116, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, దాతలు, దయార్ధ హృదయులు, మిత్రులు, బంధువులు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా పంపిన 1 లక్ష 37వేల 704 రూపాయలు మొత్తం 2 లక్షల 75 వేల 620 రూపాయలను చిన్నారుల కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందించారు. ఇప్పటివరకు పెద్ద దిక్కును కోల్పోయిన చిన్నారులు సహస్ర, దేవికలకు మొత్తం 4 లక్షల 24 వేల 500 రూపాయలు ఆర్థిక సహాయంగా అందించినట్లు తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “జనం సాక్షి” దినపత్రికకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.