జేఏసీని రాజకీయ వేదికగా మార్చే ఆలోచనలో ఉన్నాం

 

ఈనెల 30న సరూర్‌నగర్‌లో కొలువులు – కొట్లాట సభ

డిసెంబర్‌ 9,10 తేదీల్లో నల్గొండలో అమరుల స్ఫూర్తియాత్ర

విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): ఇక రాజకీయంగా పోరాటానికి జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ సన్నద్దం అవుతున్నారు. రాజకీయ వేదిక ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వాన్‌ఇన సూటిగా ప్రశ్నించేందుకు సన్నద్దం అవుతున్నారు. అందుకే జేఏసీని రాజకీయ వేదికగా మార్చాలని ఆలోచిస్తున్నామని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పేర్కొన్నారు. నాంపల్లిలోని జేఏసీ కార్యాలయంలో కొలువులకై కొట్లాట సభ విషయమై జరిగిన తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈసమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొలువుల కొట్లాటకు కోర్టు పర్మిషన్‌ మా ఒక్కరి విజయం కాదని, సభలకు అనుమతి పొందలేని వారి విజయం అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో సభల నిర్వహణ కష్టంగా మారిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చౌక్‌ను పునరుద్ధరించాలని కోదండరాం పేర్కొన్నారు. కొలువుల కొట్లాట ,అమరుల స్ఫూర్తి యాత్ర.. హైదరాబాద్‌లో విూటింగ్‌ పెట్టుకోవడం అంటే కష్టం తో కూడుకున్న పని అన్నారు. గురుకుల టీచర్‌ లకు విూటింగ్‌ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్‌ ఇవ్వలేదని, బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో ప్రెస్‌ విూట్‌ కూడా పెట్టనివ్వలేదన్నారు. హైదరాబాద్‌ లో విూటింగ్‌ పెట్టుకోవాలంటే ఇబ్బందులను గమనించే కొలువుల కొట్లాటకు పర్మిషన్‌ కోసం కోర్టుకు వెళ్ళామన్నారు. నిరసనకు, విూటింగ్‌ ఇలాంటి పరిస్థితులు మళ్లీ కల్పించవద్దు అని కోర్టు సూచించడంతో పర్మిషన్‌ రావడం జరిగిందన్నారు. సరూర్‌ నగర్‌ గ్రౌండ్‌ లో విూటింగ్‌ పెట్టుకోవాలి అని సూచించడం జరిగిందని, మేము అప్లికేషన్‌ పెట్టుకున్నామన్నారు. ఈనెల 30న సరూర్‌గన్‌ గ్రౌండ్‌లో కొలువుల కొట్లాట సభను నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు.అమరుల స్ఫూర్తియాత్ర నిర్వహించి తీరుతామని కోదండరాం పేర్కొన్నారు. డిసెంబర్‌ 9,10 అమరుల స్ఫూర్తి యాత్రను నల్గండలో కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యన్నయ రాజకీయ వేదిక కావలసిన అవకాశం ఉందన్న కోదండరాం.. జేఏసీ నాయకులు నుండి ప్రజల నుండి జేఏసీ రాజకీయ వేదిక కావాలని అందరు అడుగుతున్నారు. మేము కూడా ఆలోచన చేస్తున్నామని, రాజకీయాలు అంతా నీచమైనవి కావు

అని, వాళ్ళలాగా దొంగ దారిన మేము వెళ్ళం అన్నారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలకు ప్రభుత్వం చేయూత నివ్వాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఉద్యోగాలు రావడం లేదు అని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఖాళీల భర్తీ కి క్యాలెండర్‌ రిలీజ్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని, స్థానిక సంస్థలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వ్యవసాయం బాగుపడదాని రాష్ట్రం కోసం పోరాడితే రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రభుత్వం అవేవిూ పట్టించుకోవటం లేదని, ప్రభుత్వ నిరంకుశ విధానం వల్ల మన సభను జరుపుకోవాల్సి వస్తుందన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర లాగా అందరు జేఏసీ కార్యక్రమంకు అందరం కలిసి నిర్వహించి, నిరుద్యోగులకు ఒక భవిష్యత్‌ ను చూపిద్దామని కోదండరాం పిలుపునిచ్చారు.