జేబీసీసీఐ 11వ వేతన సవరణ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము..
…జేబీసీసీఐ 11వ వేతన సవరణ పై దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము
అలవెన్స్లపై ఎలాంటి చర్చ ప్రారంభంకాలేదు….. బిఎమ్మెస్ నేతలు………–జేబీసీసీఐ తదుపరి 9వ సమావేశం ఆలస్యం కు కారణంఐఎన్‌టియూసి వర్గపోరు కోర్టు కేసులు కారణం.జేబీసీసీఐ 11వ సవరణ కమిటీ 8వ సమావేశం 3 జనవరి 2023 నాడు జరిగింది. అట్టి సమావేశంలో 19% ఎంజిబి పై మాత్రమే ఎంఓయు జరిగింది. కానీ హెచ్ఎంఎస్ నాయకులు అలవెన్స్లపై ఫ్రిజ్ ను కొనసాగడానికి ఒప్పుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. జేబీసీసీఐ 11వ వేతన సవరణ కమిటీ చార్టర్ ఆఫ్ డిమాండ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అలవెన్స్లపై ఫ్రీజ్ ను ఎత్తివేయాలని డిమాండ్ను చేర్చాము. ఇంత వరకు అలవెన్స్లపై ఎలాంటి చర్చ జరగకముందే కార్మికుల మధ్య అసత్య ప్రచారం చేయడం శోచనీయం. బిఎంఎస్ జేబిసిసిఐ లో కీలకంగా వ్యవహరిస్తూ 19 శాతం మినిమం గ్యారెంటీ బెన్ఫిట్ సాదించిన విదంగానే ఎల్లపుడూ కార్మిక పక్షపాతిగా మెరుగైన వేతన సవరణ కై పాటుపడుతూ మెరుగైన అలవెన్స్లకై పోరాటం చేస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాము.తదుపరి జేబిసిసిఐ సమావేశము కై బిఎంఎస్ అధ్యర్యంలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 19,20 మరియు 21 వరకు గేట్ మీటింగ్లు, ధర్నాలు నిర్వహించి కొలిండియా మరియు సింగరేణి యజమాన్యం పై ఒత్తిడి తీసుకొచ్చిన విషయము విదితమే. యజమాన్యం జేబిసిసిఐ సమావేశం తేదీ ప్రకటన చేసే లోపే ఐఎన్‌టియూసి వర్గ పోరు పై హైకోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పు తరువాత మరొక వర్గం సుప్రీం కోర్టు లో కేసు వేశారు సుప్రీం కోర్టు 29.03.2023 నాడు తీర్పు రావడం తో సమస్యకు పరిష్కారం వచ్చింది.కావున బిఎంఎస్ జాతీయ నాయకులు కే.లక్ష్మారెడ్డి నిరంతర పోరాటంతో ఈ నెలలోతదుపరి 9 వ జేబిసిసిఐ సమావేశం కచ్చితంగా జరుగుతుంది కానీ ఇంతవరకు ఎలాంటి తేదీ ఖరారు కాలేదు. కొన్ని సంఘాలు ఊహాజనితంగా చీకటిలో బాణం వదిలి కార్మికుల మధ్య ఇలా అసత్య ప్రచారాలతోటి కార్మికులను ఆందోళన గురి చేయొద్దని తెలియజేస్తూ అలాంటి అసత్య ప్రచాలను బిఎంఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అని పి.మాధవ నాయక్, కార్యదర్శి ఏబికె ఎంఎస్,జేబిసిసిఐ మెంబర్యాదగిరి సత్తయ్య, అధ్యక్షులు ఎస్సిఎంకెఎస్ పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శి,పేరం రమేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లు ఒక ప్రకటనలో విషయం తెలిపారు.