జైపూర్లో జపాన్ టూరిస్టుపై అత్యాచారం
రాజస్థాన్ : జైపూర్లోని డుడులో జపాన్ టూరిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. జపాన్ టూరిస్టుపై టూరిస్ట్ గైడ్ అత్యాచారం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే జపాన్ టూరిస్టు ఫిర్యాదు ప్రకారం.. జల్మహల్ ప్రాంతం చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన వద్దకు వచ్చాడు. అతను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నాడు. చాలా మంచిగా ఇక్కడి ప్రాంతాల గురించి వివరిస్తున్నాడని.. అతడు తనకు సాయం చేస్తాడు అనుకోని మోసపోయింది. ఇదే అదునుగా భావించిన ఆ వ్యక్తి జపాన్ టూరిస్టును అత్యాచారం చేశాడు.