జోరుగా కొనసాగుతోన్న టీఆర్‌ఎస్ ‘పల్లెబాట’
హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాల్లో పల్లెబాట మత్తెడ దుంకుతోంది. టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ పల్లెబాట’ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఇరవయన రోజు ఘనంగా జరుగుతోన్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు పాల్గొంటున్నారు. తెలంగాణ పల్లె ప్రజలు ‘పల్లెబాట’ బ్రహ్మరథం పడుతున్నారు. ఈకార్యక్రమంలో పాల్గొంటున్న తెలంగాణ వాదులకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ జెండాలు ఎగురవేస్తూ జైతెలంగాణ నినాదాలు చేస్తూ తెలంగాణ వాదులు కథం తొక్కుతున్నారు. తెలంగాణ ఆవశ్యకతను గురించి ఆవశ్యకతను గురించి తెలంగాణ ప్రజలకు వివరిస్తున్నారు.