టర్కీ ఆయుధాల డిపోలో పేలుడు: 25 మంది మృతి

అంకారా: ఆయుధాల డిపోలో సంభవించిన పేలుడులో 25 మంది సైనికులు మరణించినట్లు టర్కీ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. చేత్తో వినియోగించే గ్రెనేడ్స్‌ నిలవుంచిన డిపోలో బుధవారం అర్థ రాత్రి ఈ ప్రమాదం జరిగిందని, పేలుడు కారణంగా తలెత్తిన మంటలను ఆర్పివేశాక ఉదయం సైనికుల మృతదేహాలను వెలికి తీయగలిగామని వారు తెలియజేశారు.