టీఎస్ పిఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలి – దోషులను కఠినంగా శిక్షించాలి


– అంబేద్కర్ చౌరస్తాలో నిరసన దీక్ష చేపట్టిన మంథని బీజేపీ పార్టీ నాయకులు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సూచనల మేరకు అంబేద్కర్ చౌక్ లో ఇటీవల లీకైన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపించి దోషులను కఠినంగా శిక్షించాలని సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు, ఎడ్ల సదశివ్, ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్ మాట్లాడుతూ.. దీనికి కేటిఆర్, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని, వారిని వెంటనే మంత్రి పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నైతిక బాధ్యత వహించి సీఎం కెసిఆర్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
11 ఏళ్ళు నిరుద్యోగుల కల ను నేరుగార్చాలని , కేసీఆర్ విద్యార్థుల కళ్ళలో మట్టి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని అన్నారు. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలని పిలుపునిచ్చారు. పెన్ డ్రైవ్ లో పేపర్లు దొంగిలిస్తే టీఎస్ పీఎస్సీ ఏం చేస్తున్నానని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బూత్ సశక్తి కరన్ అభియాన్ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్, మండల ప్రధాన కార్యదర్శులు వీరబోయిన రాజేందర్, తోట మధుకర్, ఉప అధ్యక్షులు బూడిద రాజు, రేపాక శంకర్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, రాపర్తి సంతోష్, పోతారవేణి క్రాంతికుమార్, తోట్ల రాజు, చాంద్ పాషా,కంచు మల్లేష్, రెప్పాల శంకర్, బొసెల్లి శంకర్, మౌనిక, తోటపల్లి లక్ష్మణ్, సబ్బాని రాజేష్, నరమల శంకర్, మెరుగు శ్రీకాంత్, కాయితి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.