టీిఆర్‌ఎస్‌లో శ్రీభగవత్‌ యూత్‌ సభ్యుల చేరిక

జ్యోతినగర్‌, జూన్‌ 12, (జనంసాక్షి):

ఎన్టీపీసీ శ్రీ భగవతీ యూత్‌ సభ్యులు 300మంది మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆద్వర్యంలో టిఆర్‌ఎస్‌లోకి చేరారు. అదేవిధంగా కృష్ణనగర్‌ కాలనీ వాసులు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ… తెలంగాణా వాదాన్ని బలపరచడానికి… ప్రజలు టిఆర్‌ఎస్‌ పార్టీపై చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువరానివని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంత ప్రజలకు జరిగే లాభాలను ఎమ్మెల్యే వివరించారు. శాంతియుత వాతావరణంలో భారతదేశ స్వాతంత్య్రం ఎలా సాధించుకున్నామో… అదే తరహాలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకుని తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలం గాణ రాష్ట్రం వచ్చేంత వరకు ప్రజలందరు ఒకేతాటిపై నడవాలని ఆయన కోరారు. ఈ కార్య క్రమంలో నాయకులు పెద్దంపేట్‌ శంకర్‌, కందుల సంధ్యారాణి, పోచం, మామిడాల చంద్రయ్య, దీటి బాలరాజు, పర్వతాలు, రవిగౌడ్‌, ప్రదీప్‌, మహేందర్‌, సమ్మయ్య,  తిరుమలతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.