టీ పై కాంగ్రెస్‌ వైఖరి ప్రకటించాలి: శ్రీహరి

హైదరాబాద్‌: తెలంగాణపై ఇతర పార్టీల్లాగే కాంగ్రెస్‌ కూడా తన వైఖరి ప్రకటించాలని, ఈ  మేరకు కేంద్రానికి లేఖ రాయాలని  తెదేపా నేత కడియం శ్రీహరి  డిమాండ్‌ వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ పార్టీ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ సెప్టెంబర్‌ మొదటి వారంలో మరోసారి కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.