టీ20 మ్యాచ్‌లో భారత్ స్కోరు 155
పల్లెకెలె: భారత్-శ్రీలంకల మధ్యజరుగుతున్న టీ 20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి 156 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందువుంచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గంభీర్ 6 పరుగులు చేసి ఎరంగా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. రహనే (21)ను మెండిస్ కాట్ అండ్ బౌల్డ్ చేయడంతో పెవిలియన్ దారి పట్టాడు. అనంతరం బరిలో దిగిన కోహ్లీ 68 పరుగులు చేసి ఎరంగా బౌలింగ్‌లో తిమ్మనె క్యాచ్ పట్టడంతో జౌటయ్యాడు. రైనా 34 పరుగులతో నటౌట్‌గా మిగిలాడు. శ్రీలంక బౌలర్లలో ఎరంగా 2,మెండిస్ 1 వికెట్ సాధించారు.