టెన్నిస్‌లో ముర్రే సంచలన విజయం

లండన&: ఒలింపిక్స్‌ టెన్నిస్‌లో సంచలనం చమోదైంది. బ్రిటన్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు ఆండీముర్రే సొంత గడ్డపై స్వర్ణం కైవశం చేసుకొని తన కల నెరవేర్చుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ ఫైనల్‌లో టావ్‌సీడర్‌ రోజర్‌ ఫెడరర్‌పై విజయం సాధించాడు. ఫైనల్‌ పోరులో 6-2, 6-1, 6-4తో గెలిచి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. విబుల్డన్‌లో ఓటమికి బదులిచ్చినట్లైంది.