ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల పునరుద్థరణ ప్రారంభం

హైదరాబాద్‌: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ధ్వంసం చేసిన విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాల పునరుద్ధరణ ప్రారంభమైంది. నాలుగు విగ్రహాలను అధికారులు ఈ రోజు ఏర్పాటు చేశారు. అయితే వీటిని అధికారికంగా ఆవిష్కరించాల్సి ఉంది. మరోవైపు విగ్రహాల రక్షణ కోసం ట్యాంక్‌బండ్‌పై పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో పది రోజుల్లో అన్ని విగ్రహాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది.