ట్రాక్టర్‌ బోల్తా… ఇద్దరి మృతి

కొత్తపేట : తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం శివారు నారాయణలంక గ్రామంలో మట్టితో వస్తున్న ఓ ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో వాడపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్‌ కోమ్మన ప్రసాద్‌ (28), క్లీనర్‌ శ్రీను (18) అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు