ట్రాన్స్‌ ఫార్మర్‌ స్థాపించిన ఎమ్మెల్యే

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) :
ఈనెల 18న ప్రచురించిన చీకటిమయంలో ఉన్న ఈర్య తండా కథనానికి నర్సంపేట టిపిడి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌ రెడ్డి స్పందించి శనివారం తండా వాసులకు మిని ట్రాన్స్‌ఫార్మర్‌ స్థాపించి తండావాసులను ఆదుకున్నారు. తండావాసులంతా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపినట్లు టిడిపి మండల అధ్యక్షుడు జున్నుతులరాంరెడ్డి తెలపారు. అలాగే మండలంలోని ఏ గ్రామాలలోనైనా ఏ సమస్య ఉన్న వెంటనే సమాచారం అందించాలని మండల నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడుప అశోక్‌, నారాయణ, మహేందర్‌, శ్రీధర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.