ట్రాన్స్ జెండర్ ల జీవనోపాధి కోసం ప్రత్యేకంగా లోన్ సదుపాయాలు

.ట్రాన్స్ జెండర్ ల జీవనోపాధి కోసం ప్రత్యేకంగా లోన్ సదుపాయాలు.
– మంత్రి. కల్వకుంట్ల తారక రామారావు.

రాజన్న సిరిసిల్లబ్యూరో. మార్చి 27.(జనంసాక్షి). తెలంగాణ లో వివక్షకు తావు లేకుండా ట్రాన్స్ జెండర్ ల కోసం వారి గుర్తింపు, జీవనోపాధి కోసం ప్రత్యేకంగా లోన్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఐటి, మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక  రామారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ లతో ముచ్చటించిన మంత్రి కేటీఆర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి పట్ల ఉన్న వివక్షను పోగొట్టడానికి, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయం అందిస్తుందని తెలిపారు.దళిత బంధు మాదిరిగానే గుర్తింపు కార్డులు పొందిన ట్రాన్స్ జెండర్ లకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.వారు నిర్భయంగా జీవించేందుకు అసాంఘిక శక్తుల చేతిలో కీలుబొమ్మల ఉండకుండా, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు, స్వతంత్రంగా జీవించేందుకు కావలసిన సదుపాయాలు కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ లకు సంక్షేమ శాఖ నుంచి విడుదలైన ఒక లక్ష రూపాయల నగదు మొత్తాన్ని చెక్కు రూపంలో వారికి అందించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.