ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి

   హత్నూర  ఏఎస్ఐ దుర్గయ్య
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకులు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని హత్నూర ఠాణా ఏఎస్ఐ దుర్గయ్య సూచించారు.మండలం పరిధిలోని దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు.ద్విచక్ర వాహన చోదకులు విధిగా తలకు హెల్మెట్ ధరించాలని వారన్నారు.మోటర్ సైకిల్,కార్లపై ఉన్న బకాయి చలాన్లను వెంటనే క్లియర్ చేసుకోవాలని ఆయన సూచించారు.డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్,వాహనాల రిజిస్ట్రేషన్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.