ట్రాయ్‌ తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో..

ఘనంగా ‘బతుకమ్మ’
ట్రాయ్‌ ( అమెరికా): దసరా పండుగను పురస్కరించుకొని అమెరికాలోని ట్రాయ్‌, డెట్రా యిట్‌లలో తెలంగాణవాసులు బతుకమ్మ సంబరా లు గురువారం ఘనంగా జరుపుకున్నారు. సంప్ర దాయ దుస్తుల్లో యువత, పిల్లలు, పెద్దలు కలిసి ఆట పాటలతో భక్తిశ్రద్ధలతో గౌరీమాతకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది ¸గా ట్రాయ్‌ మేయర్‌ జానైన్‌ డేనియల్‌ హాజర య్యారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చూసి ఆమె ముగ్ధులయ్యారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌ (టీడీఎన్‌) చేసిన కృషిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. సెప్టెంబర్‌లో టీడీఎన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ పోటీల విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీఎన్‌ కోర్‌ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ ప్రవీణ్‌, కేసిరెడ్డి అశోక్‌, పెరుమాండ్ల దామోదర్‌, గంకిడి సునీల్‌, ఎర్ల మహేష్‌, వెనుకదాసుల భరత్‌నరవెట్ల సంతోష్‌కాకులావరం, గోవిందరాజన్‌ శ్రీనివాసన్‌, రాహుల్‌ చురమ్‌, రాజ్‌ గద్దామ్‌, మనోహర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.