ట్రావెల్స్‌ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు

హైదరాబాద్‌: షోలాపూర్‌లో జరిగిన ప్రమాదంతో రవాణాశాఖ అధికారులు మేల్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయాలపై ఆర్టీఏ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఈరోజు దాడులు జరిగాయి. ప్రైవేటు ట్రావెల్స్‌కు ప్రధాన కేంద్రాలుగా ఉన్న విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి. కేసినేని, కాళేశ్వర్‌, ఎస్వీఆర్‌, పద్మావతి, శ్రీకృష్ణ, హైదరాబాద్‌. ఈదాడుల్లో కార్యాలయాల్లోని అనేక రికార్డులను తనిఖీచేశారు. ప్రాథమికంగా 9 ట్రావెల్స్‌కు అనుమతులు లేవని నిర్థారించారు.