డబుల్‌బెడ్‌రూంల నిర్మాణంలో మలేసియా భాగస్వామ్యం

C

– మలేసియా పర్యటనలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,జూన్‌ 30(జనంసాక్షి):మలేసియన్‌ కంపెనీలకోసం ప్రత్యేకంగా తెలంగాణలో ఒక  ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కోరిన కెటియార్‌ ? రెండు పడకల ఇంటి నిర్మాణంలో పాలు పంచుకునేందుకు మలేసియా ప్రభుత్వం అస్తక్తి  ఏసియాన్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ తో మంత్రి కెటిరామారావు కౌలలంపూర్‌ లో సమావేశం తెలంగాణ రాష్ట్రంలోని ూఓఇ’బ- మలేషియన్‌ కంపెనీల జాయింట్‌ వెంచర్లకు ప్రత్యేకంగా ఒక ఇంన్మర్మేషన్‌ రిపాసిటరీ సెల్‌ ఏర్పాటు మలేషియాలోని ఏసియాన్‌ ప్రాంతంలో ఒక ట్రేడ్‌ అఫీస్‌తో పనిచేసేందుకు కౌలలంపూర్‌ రిజినల్‌ సెంటర్‌ పర్‌ అర్బిట్రేషన్‌ ఆసక్తి  మలేసియా ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. సమావేశానికి హజరైన 70 మంది సియివోలు నగరంలో అంతర్జాతీయ స్దాయి కన్వేషన్‌ సెంటర్‌, ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినళ్ల నిర్మాణం చేయాలని సంస్ధని కోరిన మంత్రి మలేసియాలో పర్యటిస్తున్న మంత్రి కెటి రామారావు ఆదేశ కాబినెట్‌ మంత్రి ( మౌలిక వసతులు) డాటో సెరి సావిూ వెల్లుతో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తో మలేసియా కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రి వివరించారు. ముఖ్యంగా మాన్యూపాక్ఛరింగ్‌, ఏలక్ట్రానిక్స్‌, ఐటి, అటో మోబైల్‌ రంగాల్లో ఉన్న అవకాశాల విూద మంత్రి కెటియార్‌, మలేసియా మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రెండు పడకల ఇంటి నిర్మాణంలో పాలు పంచుకునేందుకు మలేసియా ప్రభుత్వం అస్తక్తి ఉన్నదని అయన మంత్రి కెటియార్‌ కు తెలిపారు. మలేసియా ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని తెలంగాణకి పంపాలని కెటియార్‌ మలేసియా ప్రభుత్వాన్ని కోరారు. మలేసియన్‌ కంపెనీలకోసం ప్రత్యేకంగా తెలంగాణలో ఒక ఇండస్ట్రియల్‌ పార్కు నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఏసియాన్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ తో మంత్రి కె టి రామారావు కౌలలంపూర్‌ లో సమావేశం అయ్యారు. సుమారు 20కిపైగా కంపెనీలు హజరయిన ఈ సమావేశంలో మంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏకీకృత అనుమతులు,

అవినీతి రహిత విధాన్నాన్ని అనుసరిస్తున్నదని మంత్రి తెలిపారు. తమ పారిశ్రామిక పాలసీలో అనుమతులకోసం ఉన్న సెల్ప్‌ సర్టిఫికేషన్‌, అలస్యం చేసినందుకు అధికారులవిూద జరిమానాల విధింపు వంటి అంశాలను మంత్రి ఇందుకు ఉదాహారణలుగా పెర్కోన్నారు. భారత దేశంలో ఉన్న అవకాశాలను ఏవ్యాపార సంస్ధ వదులుకునేందుకు  సిద్దంగా లేదన్న మంత్రి, సుస్ధిర, సమర్ధవంతమైన నాయకత్వంలో ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్రం భారత దేశంలో పెట్టుబడులకి అకర్షనీయ ప్రదేశామన్నారు. చిన్న మద్య తరహ  పరిశ్రమలకు ఉమ్మడి భాగసామ్యాలు, (తీనీతినిబి లవనిబిబీతీవబ) కీలకమని, వీటి ద్వారా వ్యాపారావకాశాలు విశ్వవ్యాప్తం అవుతాయని సమావేశంలో పాల్గోన్న ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. వారి అలోచనను అహ్వనించిన మంత్రి తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమ శాఖ ఇంన్మర్మేషన్‌ రిపాసిటరీ సెల్‌ ఒకటి ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా వ్యాపారా వాణిజ్యావకాశాల సమాచారం ఇరు ప్రాంతాల కంపెనీల మద్య సాద్యం అవుతుందన్నారు. ఇందుకోసం ఓక వెబ్‌ సైట్‌ ఏర్పాటు చేసి తెలంగాణలోని ూఓఇల సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇక ఒఇఆ తయారీకి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం మార్చేందుకు సైతం సిద్దంగా ఉన్నదని సమావేశంలో పాల్గోన్న యల్‌ ఈ డి తయారీదారులకి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏసియాన్‌ ప్రాంతంలో ఒక ట్రేడ్‌  అఫీస్‌ ని ఏర్పాటు చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. భారత  దేశం నుంచి అధిక సంఖ్యలో ఉన్న ఏన్నారైలు, ఏగుమతుల నేపథ్యంలో ట్రేడ్‌ అఫీస్‌ ఏర్పాటుని సానూకూలంగా పరిశీలిస్తుందని మంత్రి ప్రతినిధులకు తెలిపారు. తెలంగాణ అకాడవిూ  అప్‌ నాలెడ్జ్‌ అండ్‌ స్కిల్‌ తో కలిసి పనిచేసేందుకు కౌలలంపూర్‌  రిజినల్‌ సెంటర్‌ పర్‌ అర్బిట్రేషన్‌ ఆసక్తి వ్యక్తం చేసింది. మలేసియా ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన డిన్నర్‌ సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. ఈ సమావేశంలో సమారు 70 మంది సియివో లు హజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పాలసీలను తెలుసుకున్న వీరు, ప్రభుత్వాన్ని పనితీరుని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ అదర్శవంతమైనదన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని హవిూ ఇచ్చారు.

కౌలలంపూర్‌ లోని  సెంట్రల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాన్ని అభివృద్ది చేసిన ప్రముఖ మౌళిక రంగ సంస్ధ యంఅర్‌ సిబి. సంస్దతో జరిగిన సమావేశంలో మంత్రి హైదరాబాద్‌ లో ఇంటర్‌ సిటి బస్‌ టెర్మినల్‌  నిర్మించేందుకు అహ్వనించారు. దీంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఓక కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశిలించాలన్నారు.