డయల్‌ యువర్‌ కమిషనర్‌

కరీంనగర్‌ : నగర పాలక సంస్థ కార్యాలయంలో వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ కమిషనర్‌, ప్రజావాణి కార్యక్రమాలను నగర కమిషనర్‌ అమయ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ ఇంజినీర్‌ ఎంఎ.రషీద్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌కు వినతిపత్రాలు ఒక్కటి రాకపోగా, ప్రజావాణి కార్యక్రమానికి పదహారు ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈ రషీద్‌, ఆర్వో మక్సూద్‌ మీర్జా, టీపీబీఎస్‌ సయీదుద్దోన్‌, టీపీబీఎస్‌ రాణి, సానిటరి ఇన్స్‌స్పెక్టర్‌ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.