డాక్టరేట్ ను కైవసం చేసుకున్న సింగరేణి తేజం….

.మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు మారుపాక మొగిలి కుమార్తె మారుపాక శ్రీ లత చిన్నతనం నుంచి మార్షల్ ఆర్ట్స్ ను పట్టుదల తో నేర్చుకుని అంచెలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయి క్రీడాకారిణి గా , కోచ్ గా ,జిల్లా జనరల్ సెక్రటరీ గా, మరియు అంతర్జాతీయ న్యాయనిర్ణేతగా తనదైన శైలిలో గెలుపుని సైతం ఓడించి గెలుపును కైవసం చేసుకుని మహిళలకు ఆదర్శంగా నిలిచింది. అలాగే మార్షల్ ఆర్ట్ మీద మక్కువతో ఎందరో బాలికలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి జాతీయ మరియు అంతర్జాతీయ పతాక విజేతలుగా తీర్చిదిద్దింది.తన శ్రమకు ఫలితంగా తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రెండవ మార్షల్ ఆర్ట్స్ సీనియర్ లేడీ కోచ్ గా గుర్తించి అక్టోబర్ నెల 30వ తేదీన బెంగళూరులొ నిర్వహించే ఆసియా వేదిక్ కల్చర్ ఫౌండేషన్, హజూర్ బ్రాంచ్, చెన్నై సౌత్ ఇండియా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ను శ్రీ లతకు వైస్ చాన్స్లర్ తోపాటు ప్రముఖుల చేతుల మీదుగా ఇవ్వనున్నట్లు కో ఆర్డినేటర్ డాక్టర్ ఆకుల రమేష్ తెలియజేశారు…