డిఎస్సీ శిక్షణకు దరఖాస్తులు

ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి):
డిఎస్సీ ఉచిత శిక్షణకు గిరిజన అభ్యర్థులు ఈ నెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్‌, డిడి సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 26వరకు శిక్షణ ఉంటుందన్నారు. దరఖాస్తు దారులు టెట్‌ ఉత్తీర్ణులై ఉండి తల్లిదండ్రుల వార్షికాదాయం రెండు లక్షలు మించవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారి పిల్లలకు ఈ అవకాశం లేదన్నారు.