డివైడర్‌ను ఢీకొన్న కారు. ఇద్దరి మృతి

శంకవరం: తూర్పుగోదావరి  జిల్లా కత్తిపూడి వద్ద జాతీయ రాహదారిపై ఈ ఉదయం రాజమండ్రి నుంచి  తుని వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.